![]() |
![]() |
by సూర్య | Sun, Nov 27, 2022, 05:53 PM
రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్ లో తాజాగా మరొక స్టార్ హీరో సినిమా మరోసారి థియేటర్లకు రాబోతున్నట్టు తెలుస్తుంది. అదే మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన "ఆరెంజ్" సినిమా.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు గారు ఈ సినిమాను నిర్మించారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు.
2010, నవంబర్ 26న విడుదలైన ఈ సినిమా నిన్నటితో పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆరెంజ్ సినిమాను ఒక మంచి సందర్భం చూసి, రీ రిలీజ్ చెయ్యబోతున్నట్టు నాగబాబు గారు ట్విట్టర్ ద్వారా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు.
Latest News