శాసనసభ ట్రైలర్ .. ఔటండౌట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్

by సూర్య | Sun, Nov 27, 2022, 05:06 PM

కొంతసేపటి క్రితమే శాసనసభ ట్రైలర్ విడుదలైంది. వేణు మండికంటి డైరెక్షన్లో ఔటండౌట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. మంచి పనులు చేసి, పైసా లాభం ఆశించకుండా ప్రజలకు సేవ చెయ్యాలని తపన పడే రాజేంద్రప్రసాద్ ఒకవైపు... ఎలాంటి మోసం చేసైనా, అధికారంలో ఉండాలనుకునే సోనియా అగర్వాల్ ప్రభుత్వం మరొకవైపు.. ఈ ఇద్దరి మధ్య జరిగిన పోటీలో రాజేంద్ర ప్రసాద్ ఓడిపోవడం.. ఆయన కొడుకు, హీరో ఇంద్రసేన వైల్డ్ యానిమల్ గా ప్రభుత్వంపై యుద్ధం చెయ్యడం... ఇలాంటి పొలిటికల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది.


నటకిరీటి రాజేంద్రప్రసాద్, ఇంద్రసేన, సోనియా అగర్వాల్, ఐశ్వర్య రాజ్ భకుని, పృథ్విరాజ్, నాగమహేష్ ముఖ్యపాత్రల్లో నటించగా, రవి బస్రుర్ సంగీతం అందించారు.


ఈ చిత్రాన్ని సాప్బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్ పై తులసి రామ్, షణ్ముగం నిర్మిస్తున్నారు. పోతే, డిసెంబర్ 16న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

Latest News
 
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM