యూట్యూబ్ పై వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల ఆధిపత్యం..!!

by సూర్య | Sun, Nov 27, 2022, 03:41 PM

మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "వాల్తేరు వీరయ్య" సినిమా నుండి రీసెంట్గా ఫస్ట్ లిరికల్ బాస్ పార్టీ సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలానే నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న "వీరసింహారెడ్డి" మూవీ నుండి కూడా రెండ్రోజుల క్రితమే ఫస్ట్ లిరికల్ జై బాలయ్య విడుదలై ప్రేక్షకాభిమానులను ఒక ఊపు ఊపుతుంది. ఇంకేముంది వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద జరగాల్సిన పోటీ ప్రస్తుతం యూట్యూబులో జరుగుతుంది.


వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో #1 పొజిషన్లో, వీరసింహారెడ్డి జై బాలయ్య #2 పొజిషన్లో నువ్వా నేనా అన్నట్టు దూసుకుపోతున్నాయి. యూట్యూబులో బాస్ పార్టీ సాంగ్ కి 14 మిలియన్ వ్యూస్, 326కే లైక్స్ రాగా, జై బాలయ్య సాంగ్ కు 10 మిలియన్ వ్యూస్, 246కే లైక్స్ వచ్చాయి. మొత్తానికి యూట్యూబ్ పై వీరిద్దరూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

Latest News
 
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM