ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్ ..!!

by సూర్య | Sat, Nov 26, 2022, 09:40 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మారుతీ డైరెక్షన్లో గుట్టుచప్పుడు కాకుండా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ సినిమాపై క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.


ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఆ ముగ్గురిలో ఇప్పటికే కోలీవుడ్ బ్యూటీ మాళవికా మోహనన్, హైదరాబాద్ బ్యూటీ నిధి అగర్వాల్ కంఫర్మ్ అయ్యారని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం, మూడవ హీరోయిన్ గా ఒక యంగ్ బ్యూటీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఆమెవరో కాదు రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ 'స్పోర్ట్స్ వద్దు' అని ఎవరికైతే చెప్తాడో ఆమెనే. రిద్ధి కుమార్. గతంలో రాజ్ తరుణ్ తో "లవర్" లో హీరోయిన్ గా నటించింది. ఆపై తెలుగులో ఏ సినిమాలోనూ రిద్ధి హీరోయిన్ గా నటించలేదు. ఇప్పుడు ఒకేసారి పాన్ ఇండియా స్టార్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ధృవ నచ్చతిరమ్' Fri, Sep 22, 2023, 08:52 PM
నయనతార 'ఇరైవన్' చిత్రానికి జీరో కట్‌లతో A సర్టిఫికేట్ Fri, Sep 22, 2023, 08:49 PM
ఎట్టకేలకు OTT విడుదల తేదీని లాక్ చేసిన 'ఏజెంట్' Fri, Sep 22, 2023, 07:24 PM
'లియో' రన్‌టైమ్ లాక్? Fri, Sep 22, 2023, 07:21 PM
తమిళ వెర్షన్ OTT విడుదల తేదీని లాక్ చేసిన 'డర్టీ హరి' Fri, Sep 22, 2023, 07:19 PM