అమీర్ ఖాన్ ని ఫాలో అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 07:45 PM

సినిమాలకు రెండేళ్లు విరామమిచ్చి, ఆ సమయంలో కుటుంబంతో విలువైన సమయాన్ని గడిపేందుకు నిర్ణయించుకున్నట్టు ప్రకటించి ప్రేక్షకాభిమానులను షాకింగ్ సర్ప్రైజింగ్ కి గురి చేసారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్.


ఇప్పుడదే బాటలో అంటే ఆమిర్ ఖాన్ అనుసరిస్తున్న ఫార్ములానే కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తునివు మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న అజిత్ ఈ సినిమా నుండి ఫ్రీ అయిపోగానే 6-8 నెలలు సినిమాలకు విరామమివ్వాలని అనుకుంటున్నారట. ఆ సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలని అనుకుంటున్నారట. ఈ మేరకు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.


హెచ్ వినోద్ డైరెక్షన్లో రూపొందుతున్న తునివు వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతుంది. ఆపై అజిత్ నెక్స్ట్ మూవీ నయనతార భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ఉంటుంది.

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM