రేపే తెలుగులో రాబోతున్న కోలీవుడ్ సెన్సేషన్

by సూర్య | Thu, Nov 24, 2022, 07:36 PM

చిన్న సినిమాగా విడుదలైన లవ్ టుడే కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పదహారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన లవ్ టుడే 65 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుని విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ప్రశాంత్ రంగనాథన్ డైరెక్షన్లో యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో ప్రశాంత్ రంగనాథన్ హీరోగా యాక్టింగ్ డిబట్ చేసారు. ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.


నవంబర్ 4న విడుదలైన ఈ మూవీ కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు తెలుగులో లవ్ టుడే ను రిలీజ్ చేస్తున్నారు. పోతే, రేపే ఈ మోడరన్ లవ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.


ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలలో 280కి పైగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం 3 కోట్ల* బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంటే కానీ సూపర్ హిట్ అనిపించుకోదు.

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM