'SSMB28' రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

by సూర్య | Thu, Nov 24, 2022, 07:14 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మహేష్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జోడిగా నటిస్తుంది. షూటింగ్ ఫార్మాలిటీస్‌లో ఆలస్యం కారణంగా సినిమా ఆగష్టు 2023 కి వాయిదా వేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.


సంగీత దర్శకుడు ఎస్ థమన్ స్థానంలో ప్రముఖ సంగీతకారుడు అనిరుధ్‌ను తీసుకోవాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈరోజు, చిత్ర నిర్మాత నాగ వంశీ ట్విట్టర్‌లో థమన్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ బాబు చిత్రంలో అతని ట్యూన్‌ల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడని ఈ ట్వీట్ ధృవీకరించింది.


కొన్ని రోజుల క్రితం తన తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ షూటింగ్ కి రాలేకపోయారు అన్ని ఫార్మాలిటీల పూర్తి చేసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ మళ్ళీ షూటింగ్ ప్రారంభించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:28 AM
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM