జంతుసంక్షేమ సంస్థ నుండి "వారిసు" చిత్రబృందానికి నోటీసులు ..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 05:03 PM

తలపతి విజయ్ ప్రస్తుతం వారిసు సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం వరస ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఆంధ్ర తెలంగాణాలలో ఇప్పటికే వారిసు మూవీ థియేటర్స్ సమస్యను ఎదుర్కొంటుండగా, తాజాగా మరొక ఇబ్బంది వారిసు టీం ను సతమతం చేస్తుంది.


తాజా సమాచారం ప్రకారం, యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుండి ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోకుండా, వారిసు షూటింగ్ లో ఏనుగులను ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. ఈ కారణంగా యానిమల్ వెల్ఫేర్ బోర్డు వారిసు మేకర్స్ కి నోటీసులు పంపించింది.


తెలుగులో ఈ సినిమా వారసుడు టైటిల్ తో విడుదల కాబోతుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాతోనే  దిల్ రాజు కోలీవుడ్ లో నిర్మాతగా ఆడుతుపెట్టబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Jun 05, 2023, 09:15 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '777 చార్లీ' Mon, Jun 05, 2023, 08:50 PM
'బిచ్చగాడు 2' 15 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Mon, Jun 05, 2023, 08:48 PM
బాలకృష్ణ 108వ మూవీ అప్డేట్ Mon, Jun 05, 2023, 08:38 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మెన్ టూ' Mon, Jun 05, 2023, 08:21 PM