బాస్ పార్టీ OK ... జైబాలయ్య పైనే అందరి దృష్టి ..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 03:52 PM

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి ఇద్దరు సీనియర్ తెలుగు హీరోల సినిమాలు దిగబోతున్న విషయం తెలిసిందే కదా. ఒకటి - మెగాస్టార్ చిరంజీవి - బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన "వాల్తేరు వీరయ్య", రెండోది - బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న "వీరసింహారెడ్డి". ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీకి ఇంకాస్త సమయం పడుతుంది.


ఈ విషయం పక్కన పెడితే, నిన్ననే వాల్తేరు వీరయ్య సినిమా నుండి డీజే వీరయ్య బాస్ పార్టీ సాంగ్ విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. DSP అందించిన మ్యూజిక్ ట్రాక్ మరీ సూపర్ హిట్ కాదు గానీ ప్రేక్షకాభిమానుల చేత జస్ట్ ఓకే అనిపించుకుంది. ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి ఫస్ట్ సింగిల్ పై అందరి దృష్టి పడింది.


నిన్న సాయంత్రమే వీరసింహారెడ్డి నుండి 'జై బాలయ్య రాజసం నీ ఇంటి పేరు' ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన అఖండ - జై బాలయ్య సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో, ఇప్పుడదే టైటిల్ తో మరొక సాంగ్ రాబోవడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. ప్రేక్షకుల చేత బాస్ పార్టీ ఓకే అనిపించుకోగా, జై బాలయ్య ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest News
 
శివ కార్తికేయన్ 'SK 25' టైటిల్ ఫిక్స్? Thu, Jan 23, 2025, 08:23 PM
సస్పెన్స్ థ్రిల్లర్‌ 'క' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' Thu, Jan 23, 2025, 07:10 PM
'లైలా' నుండి ఇచ్చుకుందాం బేబీ సాంగ్ రిలీజ్ Thu, Jan 23, 2025, 07:03 PM
'జాట్' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 06:57 PM