హీరోయిన్ పై నిర్మాత కేసు!
by సూర్య |
Thu, Nov 24, 2022, 03:43 PM
బాలీవుడ్ హీరోయిన్ రిచా చడ్డా చిక్కుల్లో పడింది. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు నిర్మాత అశోక్ పండిట్. 'మన దేశ భద్రతా బలగాలను రిచా చడ్డా కించపరిచారు, ముఖ్యంగా గల్వాన్ లోయలో ప్రాణ త్యాగం చేసిన వీరులను తూలనాడారు. ఇది ముమ్మాటికీ నేరమే. ఆమెపై FIR నమోదు చేయాల్సిందే' అని పేర్కొన్నారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను క్షణాల్లో హస్తగతం చేసుకుంటామని ఓ భారత సైనికాధికారి చేసిన ట్వీట్‌కు 'గల్వాన్ మీకోసం ఎదురుచూస్తోంది' అనే అర్థంలో ఆమె బదులిచ్చారు. ఆమె ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
Latest News