"మసూద" సక్సెస్ మీట్లో దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ ..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 12:25 PM

తలపతి విజయ్ నటిస్తున్న "వారిసు/ వారసుడు" సినిమా విడుదల నిమిత్తమై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో కొంత వివాదకర పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. వారిసు పక్కా తమిళ్ సినిమా అని పేర్కొన్న దిల్ రాజు రీజినల్ సినిమాల కన్నా ఎక్కువ ధియేటర్స్ లో ఆ సినిమాను విడుదల చెయ్యాలనుకోవడంతో వివాదం రాజుకుంది.


తాజాగా జరిగిన మసూద సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ... వారిసు సినిమా వివాదంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. దిల్ రాజు సినిమా తొక్కేస్తాడు.. అదీ ఇదీ అంటూ నా గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ, సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తిని నేను. డబ్బులు నాకు అవసరం లేదు. డబ్బులతో ఏం చేసుకుంటాం... లవ్ టుడే సినిమాను ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తెలుగులో విడుదల చేస్తున్నాను. త్వరలోనే వారిసు ధియేటర్స్ ఇష్యూ గురించి ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను వెల్లడిస్తా... అంటూ చెప్పుకొచ్చారు.

Latest News
 
నిఖిల్ కోసం పాటా పాడిన తమిళ హీరో శింబు Sun, Nov 27, 2022, 11:13 AM
ఈ వారం బిగ్ బాస్ నుండి మోడల్ ఎలిమినేట్ Sun, Nov 27, 2022, 11:01 AM
'గుర్తుందా శీతాకాలం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Nov 27, 2022, 10:48 AM
నేడు జరుగనున్న సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ Sun, Nov 27, 2022, 10:42 AM
సోషల్ మీడియా డిబట్ చేసిన హీరో అజిత్ భార్య..!! Sun, Nov 27, 2022, 10:03 AM