యశోద ఓటిటి రిలీజ్ పై కోర్టు స్టే ఆర్డర్స్ ..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 11:00 AM

క్రేజీ హీరోయిన్ సమంత నటించిన తొలి పాన్ ఇండియా మూవీ "యశోద". హరి శంకర్, హరీష్ నారాయణ్ ల దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ ఉమెన్ సెంట్రిక్ మూవీ గా రూపొందిన యశోద కు పాన్ ఇండియా ప్రేక్షకుల నుండి మాత్రమే కాక సినీ విశ్లేషకులు, సినీ సెలెబ్రిటీల నుండి కూడా ప్రశంసలు వస్తున్నాయి.


రెండు వారాలు గడుస్తున్నా యశోద కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గుముఖం పడట్లేదు. ఈ నేపథ్యంలో యశోద ఓటిటి రిలీజ్ కు ఇంకా సమయం పడుతుందని అంతా అనుకున్నారు కానీ, ఇప్పుడు అసలు యశోద మూవీ ఓటిటిలోకి వస్తుందో లేదో కూడా తెలియట్లేదు. ఎందుకంటే యశోద ఓటిటి రిలీజ్ పై కోర్టు స్టే ఆర్డర్స్ విధించింది.


అసలు విషయమేంటంటే, యశోద సినిమాలో 'Eva హాస్పిటల్స్' పేరును నెగిటివ్ గా ఉపయోగించారని, దీంతో ప్రజల్లో తమ హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందని వాపోతూ సంస్థ యాజమాన్యం యశోద డిజిటల్ రిలీజ్ ను అడ్డుకుంటూ కోర్టుకెక్కింది. తదుపరి డిసెంబర్ 19న కోర్టు విచారణ ఉంటుంది.

Latest News
 
ఆహాలో అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రికార్డ్ ..!! Tue, Dec 06, 2022, 09:11 AM
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM