'నువ్వు నిజం నీ నవ్వు నిజం' పాట లిరిక్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 10:57 AM

పల్లవి:
నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతి నడుగు
వేరే వెన్నెలుంది అనదు ఉన్నా దాన్ని వెన్నెలనదు
నేను నిజం నా ప్రేమ నిజం ఇది పిచ్చిదనం అనకు
అన్నా మనసు మాట వినదు విన్నా అవును కాదు అనదు
నీలో నా సంతకం చెరిపే వీల్లేదుగా
నాలో నీ ఙాపకం కరిగే కల కాదుగా
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

చరణం 1:
ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులు
వింటే కొంటె అష్టపదులు వెంటే పడవ అష్టదిశలు
ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు
చూస్తే జంటలేని ఎదలు మనకే తగులుతుంది ఉసురు
చెబితే వినవే ఎలా ఎగసే నిట్టూర్పులు
చలితో అణిచేదెలా రగిలే చిరుగాలులు
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

చరణం 2:
ఎప్పటికీ నను తప్పుకునేవీ ఇవ్వని కౌగిలులు
చుట్టూ చిలిపి చెలిమి చెరలు కట్టా చూడు వలపు వలలు
దుప్పటిలా నను కప్పినవేనల నల్లని నీ కురులు
ఇట్టా మాయదారి కలలు చూస్తూ మేలుకోవు కనులు
మనసే దోస్తే ఎలా తనకే ఈ సంకెలా
ఒడిలో పడితే ఎలా అడుగే కదిలేదెలా
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

Latest News
 
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM
అన్స్టాపబుల్ : వాడీవేడిగా పవర్ స్టార్మ్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో Sun, Feb 05, 2023, 06:54 PM
రైటర్ పద్మభూషణ్ రెండ్రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..!! Sun, Feb 05, 2023, 06:34 PM