నాగార్జున - అడివిశేష్ కలయికలో యాక్షన్ లవ్ స్టోరీ ..??

by సూర్య | Wed, Nov 23, 2022, 08:20 PM

కింగ్ నాగార్జున రీసెంట్గానే ఘోస్ట్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించి పాజిటివ్ రివ్యూస్ అందుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఘోస్ట్ పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో నాగార్జున నుండి ఏ కొత్త సినిమా ప్రకటన కూడా జరగలేదు.


తాజా సమాచారం ప్రకారం, నాగార్జున - అడివిశేష్ కలయికలో ఒక యాక్షన్ లవ్ స్టోరీ సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఐతే, నాగార్జున ఈ సినిమాలో నటించడం కాదు... నిర్మాతగా వ్యవహరిస్తారన్న మాట. అడివిశేష్ హీరోగా ఒక యాక్షన్ లవ్ స్టోరీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్లాన్ చేస్తుందని, ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. మరి, ఈ విషయంలో అధికారిక ప్రకటన వస్తేగాని నిజమని తేలదు.


ప్రస్తుతం శేష్ హిట్ 2 రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది.

Latest News
 
'తరలిరాద తనే వసంతం' సాంగ్ లిరిక్స్ Sat, Sep 23, 2023, 11:10 AM
డ్రగ్స్ కేసులో నేడు నవదీప్ విచారణ Sat, Sep 23, 2023, 11:07 AM
‘సింగం లాంటి సినిమాలు చాలా డేంజర్’ Sat, Sep 23, 2023, 11:00 AM
మంచు లక్ష్మీ మరో ట్వీట్.. వైరల్ వీడియో Sat, Sep 23, 2023, 10:59 AM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ధృవ నచ్చతిరమ్' Fri, Sep 22, 2023, 08:52 PM