టీజర్ పై వస్తున్న కామెంట్లతో ప్రభాస్ అసహనానికి గురయ్యాడా

by సూర్య | Wed, Oct 05, 2022, 11:28 PM

ఆదిపురుష్ టీజ‌ర్ కు వ‌స్తున్న స్పంద‌న త‌ర్వాత చాలా నిరుత్సాహ‌ప‌డ్డ ప్ర‌భాస్‌.. ద‌ర్శ‌కుడిపై  ఆగ్ర‌హంగా ఉన్నాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. రాధేశ్యామ్‌తో భారీ డిజాస్ట‌ర్ ను ఖాతాలో వేసుకున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా న‌టించ‌గా.. ప్ర‌తినాయ‌క పాత్ర‌లో  సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడి పాత్ర పోషించాడు. కృతి స‌న‌న్ హీరోయిన్. భారీ అంచనాల నడుమ ఈనెల‌ 2న ఈ సినిమా టీజర్ విడుదలైంది. అయితే, వీఎఫ్ ఎక్స్, యానిమేషన్ నాసిర‌కంగా ఉన్నాయంటూ ఈ టీజ‌ర్ పై తీవ్ర విమర్శలు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. 


టీజ‌ర్ కు వ‌స్తున్న స్పంద‌న త‌ర్వాత చాలా నిరుత్సాహ‌ప‌డ్డ ప్ర‌భాస్‌.. ద‌ర్శ‌కుడిపై  ఆగ్ర‌హంగా ఉన్నాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో  ప్రభాస్ కోపంగా కనిపిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో  అతను దర్శకుడు ఓం రౌత్‌ని తన గదికి రమ్మని అడగడం క‌నిపించింది. "ఓం, నువ్వు నా రూమ్‌కి వస్తున్నావ్ క‌దా. నాతో రా" అని ప్ర‌భాస్ వేలు చూపిస్తూ రౌత్‌కు చెప్పాడు. దాంతో, ప్రభాస్, ఓం రౌత్ మధ్య అంతా బాగాలేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆదిపురుష్ టీజ‌ర్ ను విడుద‌ల చేసిన స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలుస్తోంది. అయితే, ఓ రౌత్‌తో ప్ర‌భాస్ ఏం మాట్లాడాడనే విష‌యం వెల్ల‌డి కాలేదు. 


 

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM