డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'కార్తికేయ 2'

by సూర్య | Wed, Oct 05, 2022, 05:09 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.


ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో సంతనుగా ఆదిత్య మీనన్, సులేమాన్‌గా హర్ష చెముడు, సదానందగా శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ధన్వంతి పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. కార్తికేయ2 సినిమా పోస్ట్ థియేట్రికల్ OTT స్ట్రీమింగ్ రైట్స్ ని ZEE5 భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఈ ఈరోజు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM