రేపే ... 'గాడ్ ఫాదర్' గా మెగాస్టార్ ధియేటర్ ఎంట్రీ..!!

by సూర్య | Tue, Oct 04, 2022, 04:01 PM


2019లో విడుదలైన మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ "లూసిఫర్" లో మోహన్ లాల్ ఫస్ట్ క్లాస్ యాక్టింగ్ ను కనబరిచి ప్రేక్షకులను విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే సినిమాను తెలుగులో "గాడ్ ఫాదర్" పేరుతో మెగాస్టార్ చిరంజీవి గారు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం చేస్తుండగా, తమన్ సంగీతం అందించారు.


గాడ్ ఫాదర్ పోస్టర్స్, ఆడియో క్లిప్స్, టీజర్, ట్రైలర్ లతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. చిరు గత చిత్రం ఆచార్య మిగిల్చిన నెగిటివిటీని ఈ సినిమా పూర్తిగా పారద్రోలి, మెగాస్టార్ స్టామినా ఏంటో టాలీవుడ్ బాక్సాఫీస్ కు మరోసారి రుచి చూపించాలని బలంగా కోరుకుంటున్నారు.


158 నిమిషాల నిడివి గల ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాధ్, సునీల్ కీలకపాత్రలు పోషిస్తుండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్ రోల్ చేసారు. పోతే, ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషలలో కూడా రేపేథియేటర్లలో విడుదల కాబోతుంది.

Latest News
 
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM
మహేష్ బాబు - త్రివిక్రమ్ ల సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! Mon, Dec 05, 2022, 11:24 PM
బెదురులంక 2012: శివ ఫస్ట్ లవ్ "చిత్ర"గా నేహశెట్టి..!! Mon, Dec 05, 2022, 11:05 PM