తెలుగు, తమిళ భాషలలో "ఘోస్ట్" రేపే గ్రాండ్ రిలీజ్

by సూర్య | Tue, Oct 04, 2022, 03:52 PM

టాలీవుడ్ కింగ్ నాగార్జున నుండి రాబోతున్న పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ "ది ఘోస్ట్". సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను "PSV గరుడవేగా" ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసారు.హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో, మైండ్ బ్లోయింగ్ స్వోర్డ్ ఫైట్ సీన్లతో ఘోస్ట్ మూవీ ప్రేక్షకులను ఎక్జయిట్ చేసేది రేపటి నుండే. ఎందుకంటే రేపే తెలుగు, తమిళ భాషలలో ఘోస్ట్ మూవీ విడుదల కాబోతుంది.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్ లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు. రేపే చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా రిలీజ్ కాబోతుంది. మరి ఘోస్ట్ గాడ్ ఫాదర్ తాకిడిని ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతాడా ? లేదా? అన్నది రేపు తెలుస్తుంది.

Latest News
 
ఆహాలో అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రికార్డ్ ..!! Tue, Dec 06, 2022, 09:11 AM
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM