రేపు విడుదల కాబోతున్న అభిరాం ''అహింస" టీజర్

by సూర్య | Tue, Oct 04, 2022, 03:33 PM

విభిన్న చిత్రాల దర్శకుడు తేజ డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం "అహింస". ఈ మూవీతో దగ్గుబాటి కుటుంబం నుండి అభిరాం హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. రీసెంట్గా విడుదలైన వరస వాయిస్ క్లిప్పింగ్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసాయి.


లేటెస్ట్ గా మేకర్స్ మూవీ టీజర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. దసరా పండుగను పురస్కరించుకుని రేపు అహింస టీజర్ ను విడుదల చెయ్యబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. పోస్టర్ విభిన్నంగా, ఆసక్తిని కలిగించేలా ఉంది.


పోతే, ఈ సినిమాలో గీతికా హీరోయిన్ గా నటిస్తుండగా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. RP పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM