యూట్యూబ్ #1 ట్రెండింగ్ లో "గాడ్ ఫాదర్" ట్రైలర్

by సూర్య | Fri, Sep 30, 2022, 03:46 PM

మోస్ట్ ఎవైటెడ్ గాడ్ ఫాదర్ ట్రైలర్ రాకతో మెగా అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు. ట్రైలర్ తో అభిమానులు మాస్ పూనకాలతో నిండిపోగా, గాడ్ ఫాదర్ థియేటర్లలో విడుదలయ్యేంత వరకు ఆ పూనకాలు అలానే కంటిన్యూ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, గాడ్ ఫాదర్ ట్రైలర్ యూట్యూబ్ #1 ట్రెండింగ్ లో కొనసాగుతూ, ఇప్పటివరకు 13మిలియన్ వ్యూస్ ని రాబట్టింది. దీంతోనే అర్ధమైపోతుంది... జనాలకి గాడ్ ఫాదర్ మ్యానియా ఏ రేంజులో పట్టేసిందో.



కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.



సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కాబోతుంది.

Latest News
 
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM
'మిరాయి' చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 22, 2024, 08:43 PM