యూట్యూబ్ #1 ట్రెండింగ్ లో "గాడ్ ఫాదర్" ట్రైలర్

by సూర్య | Fri, Sep 30, 2022, 03:46 PM

మోస్ట్ ఎవైటెడ్ గాడ్ ఫాదర్ ట్రైలర్ రాకతో మెగా అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు. ట్రైలర్ తో అభిమానులు మాస్ పూనకాలతో నిండిపోగా, గాడ్ ఫాదర్ థియేటర్లలో విడుదలయ్యేంత వరకు ఆ పూనకాలు అలానే కంటిన్యూ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, గాడ్ ఫాదర్ ట్రైలర్ యూట్యూబ్ #1 ట్రెండింగ్ లో కొనసాగుతూ, ఇప్పటివరకు 13మిలియన్ వ్యూస్ ని రాబట్టింది. దీంతోనే అర్ధమైపోతుంది... జనాలకి గాడ్ ఫాదర్ మ్యానియా ఏ రేంజులో పట్టేసిందో.కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కాబోతుంది.

Latest News
 
ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌కి సహాయం చేసిన చిరంజీవి Fri, Feb 03, 2023, 10:51 PM
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీపై స్పందించిన బోనీ కపూర్ Fri, Feb 03, 2023, 10:15 PM
షక్కింగ్ TRPని నమోదు చేసిన 'కాంతారా' Fri, Feb 03, 2023, 09:00 PM
తన కూతురు కోలీవుడ్ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ పై స్పందించిన స్టార్ ప్రొడ్యూసర్ Fri, Feb 03, 2023, 08:50 PM
పీరియడ్ డ్రామా నేపథ్యంలో..నాగార్జున నెక్స్ట్ ..? Fri, Feb 03, 2023, 07:00 PM