నేడు విడుదల కానున్న 'ది ఘోస్ట్' ట్రైలర్

by సూర్య | Fri, Sep 30, 2022, 03:40 PM

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్‌' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఏజెంట్ విక్రమ్ గా నాగార్జున కనిపించనున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ట్రైలర్ ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు విడుదల కానుందని ఈరోజు ఉదయం డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు రవివర్మ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ జి. గణేష్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి భరత్-సౌరభ్ సంగీతం అందించారు.

Latest News
 
'లియో' మూవీ రెండవ సింగిల్ రిలీజ్ Thu, Sep 28, 2023, 09:29 PM
స్టార్ హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు Thu, Sep 28, 2023, 09:15 PM
హీరో సిద్ధార్థ్‌కు కర్ణాటకలో చేదు అనుభవం Thu, Sep 28, 2023, 09:06 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' Thu, Sep 28, 2023, 08:58 PM
రేపు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'ఏజెంట్' Thu, Sep 28, 2023, 08:56 PM