మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా ఫేమస్ కొరియోగ్రాఫర్...???

by సూర్య | Fri, Sep 30, 2022, 03:18 PM

మెగాస్టార్ చిరంజీవి నుండి దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన "గాడ్ ఫాదర్" రావడానికి రెడీగా ఉందన్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమా తదుపరి బాబీ డైరెక్షన్లో చేస్తున్న 'మెగా 154', మెహర్ రమేష్ డైరెక్షన్లో చేస్తున్న 'భోళా శంకర్' సినిమాలు మెగాస్టార్ నుండి రావడానికి సిద్ధమవుతున్నాయి.
ఈ సినిమాల తదుపరి మెగాస్టార్ చెయ్యబోయే మూవీపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే, ఫేమస్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ ఎన్నో పాటలకు స్టెప్స్ వేసారు. అలానే 2007లో వచ్చిన మెగాస్టార్ మూవీ "శంకర్ దాదా జిందాబాద్" సినిమాకు ప్రభుదేవానే డైరెక్టర్. లేటెస్ట్ గా మరోసారి ప్రభుదేవా డైరెక్షన్లో చిరు ఒక సినిమా చేయబోతున్నారని వినికిడి.
గాడ్ ఫాదర్ తార్ మార్ తక్కర్ మార్ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసారు. ఈ సాంగ్ షూటింగ్ క్రమంలో ఇద్దరూ కూడా ఒక సినిమా చెయ్యాలని చర్చలు జరపడం జరిగిందట. మరి చూడాలి... ఈ కాంబో ఫైనలైజ్ అవుతుందో లేదో...!!

Latest News
 
'సర్' 27వ రోజు AP/TS కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 03:54 PM
'బలగం' 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 03:42 PM
'అమిగోస్' డే వైస్ కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 03:40 PM
'వినరో భాగ్యము విష్ణు కథ' 27 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Mon, Mar 20, 2023, 03:38 PM
ఇటలీ, స్పెయిన్‌లో విడుదలకి సిద్దమవుతున్న 'కాంతారా' Mon, Mar 20, 2023, 03:24 PM