'మంత్ ఆఫ్ మధు' టీజర్ కు ప్రముఖుల ప్రశంసలు

by సూర్య | Fri, Sep 30, 2022, 01:09 PM

నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం "మంత్ ఆఫ్ మధు'. నిన్ననే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ప్రేమలో పడ్డానికి ఒక క్షణం సరిపోతుంది... అదే ప్రేమ నుండి బయటపడ్డానికి ఒక ప్రయాణమే చెయ్యాల్సివస్తుంది... అనే ఇంటరెస్టింగ్ టాపిక్ తో వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది. అలానే కొంతమంది ప్రముఖుల నుండి కూడా ఈ టీజర్ కు స్పెషల్ అప్లాజ్ వస్తుంది. గౌతమ్ తిన్ననూరి, విక్రమ్ కే కుమార్, సందీప్ రెడ్డి వంగా, అడవిశేష్, రాహుల్ రవీంద్రన్... టీజర్ క్లాస్ గా ఉందని, సినిమా కోసం ఎదురు చూస్తున్నామని ట్వీట్ చేసారు.టీజర్ తో ఒక్కసారిగా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కలర్స్ స్వాతి కంబ్యాక్ ఫిలిం గా చెప్తున్న ఈ మూవీని శ్రీకాంత్ నాగోతి డైరెక్ట్ చెయ్యగా, కృషివ్ ప్రొడక్షన్, హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్లపై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'ఊర్వశివో రాక్షశివో' AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:46 AM
'యశోద' 23 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:32 AM
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 11 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:23 AM
గూగుల్ సెర్చ్ లో టాప్-10 సినిమాలివే! Thu, Dec 08, 2022, 11:17 AM
ఈ ఏడాదికి పాపులర్ ఇండియన్ స్టార్స్‌ వీరే Thu, Dec 08, 2022, 11:06 AM