పదిహేనురోజులకే ఓటిటిలోకొచ్చేస్తున్న "శాకినిడాకిని"

by సూర్య | Thu, Sep 29, 2022, 03:37 PM

టాలీవుడ్ హీరోయిన్లు రెజీనా కస్సాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం "శాకినిడాకిని". సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ థ్రిల్లర్ సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదలై, ప్రేక్షకులను అలరించలేకపోయింది.దీంతో మేకర్స్ ఈ మూవీని పదిహేను రోజుల వ్యవథిలోనే డిజిటల్ రంగంలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుండే శాకినిడాకిని సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జరిగింది.2017లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైన సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ 'మిడ్ నైట్ రన్నర్స్' కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ మూవీని డి. సురేష్ బాబు, సునీతా తాటి నిర్మించారు.

Latest News
 
'ఊర్వశివో రాక్షశివో' AP/TS కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:59 PM
'మసూద' 15 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:52 PM
'హిట్ 2' 3 రోజుల డే వైస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:45 PM
'కాంతార' 45 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:31 PM
'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:27 PM