సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌'

by సూర్య | Sat, Sep 24, 2022, 08:57 PM

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్‌' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5, 2022న ప్రపంచవ్యాప్తంగా  థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఏజెంట్ విక్రమ్ గా నాగార్జున కనిపించనున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఈరోజు సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందినట్లు మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. బాలీవుడ్ యాక్టర్ మనీష్ చౌదరి ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు రవివర్మ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ జి. గణేష్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి భరత్-సౌరభ్ సంగీతం అందించారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM