ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్

by సూర్య | Sat, Sep 24, 2022, 08:54 PM

కరణ్ అన్షుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన మొదటి వెబ్ సిరీస్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి 'రానా నాయుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. టాలీవుడ్ హ్యాండ్సమ్ హల్క్ రానా దగ్గుబాటి కూడా కనిపించనున్నారు. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ రోజు ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను రివీల్ చేసారు. ఈ టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా కనిపిస్తోంది.


ఈ తెలుగు క్రైమ్ డ్రామా సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, రాజేష్ జైస్ మరియు ప్రియా బెనర్జీ  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రైమ్ డ్రామా పాపులర్ అమెరికన్ టీవీ సిరీస్ 'రే డోనోవన్' కి ఆధారంగా రూపొందిస్తున్నారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా LLPకి చెందిన సుందర్ ఆరోన్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు.

Latest News
 
మెగా హీరోలతో నెట్‌ఫ్లిక్స్ సీఈవో సమావేశం Thu, Dec 07, 2023, 11:33 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అహింస' Thu, Dec 07, 2023, 08:20 PM
'నా సామి రంగా' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Thu, Dec 07, 2023, 08:17 PM
'సైంధవ్‌' కి డబ్బింగ్ ప్రారంభించిన నవాజుద్దీన్ Thu, Dec 07, 2023, 08:02 PM
'అఖండ 2' రెగ్యులర్ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ Thu, Dec 07, 2023, 07:54 PM