OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి'

by సూర్య | Sat, Sep 24, 2022, 08:51 PM

అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన 'కృష్ణ బృందా విహారి' చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చినా ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ సోనీలివ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. రానున్న రోజులలో విడుదల తేదీని OTT ప్లాట్‌ఫారమ్ అధికారకంగా ప్రకటించనున్నారు.


ఈ సినిమాలో  నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM