'గాడ్ ఫాదర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ తేదీన జరుగనుందా ?

by సూర్య | Fri, Sep 23, 2022, 07:57 PM

మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా మలయాళంలో "లూసిఫర్‌" సినిమాకు రీమేక్. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సెప్టెంబర్ 28, 2022న అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరగనుంది అని సమాచారం. అయితే మూవీ టీమ్ నుంచి ఈ విషయం గురించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5, 2022న తెలుగు మరియు హిందీలో విడుదల కానుంది. పొలిటికల్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, పూరి జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న గాడ్ ఫాదర్ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

Latest News
 
సిట్టింగ్ ఫోజులతో రీతూ వర్మ కిర్రాక్ ఫోజులు Sun, Sep 24, 2023, 12:00 PM
అందాలతో చంపేస్తున్నదిశా పటానీ Sun, Sep 24, 2023, 11:49 AM
'క‌న్న‌ప్ప‌'లో ప్రభాస్‌కు జోడీగా న‌య‌న‌తార‌ Sun, Sep 24, 2023, 10:57 AM
విడుదల తేదీని ఖరారు చేసిన 'ధృవ నచ్చతిరమ్' Sat, Sep 23, 2023, 08:57 PM
గోపీచంద్-శ్రీను వైట్ల సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ Sat, Sep 23, 2023, 08:47 PM