హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ..?

by సూర్య | Fri, Sep 23, 2022, 07:13 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ "అల వైకుంఠపురంలో". మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకుడు. 2020లో విడుదలైన ఈ మూవీ అల్లుఅర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడవ సినిమా.
గతంలో ఇదే కాంబోలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈ కాంబో మరోసారి తెరపైకి రాబోతుందని టాక్.
ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 2 పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉండగా, త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. వీరిద్దరూ ఈ రెండు సినిమాలను ముగించుకుని మరోసారి చేతులు కలపబోతున్నారని టాక్. హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబోలో మరొక సినిమా అంటే, అంచనాలు ఆకాశాన్ని అంటడం ఖాయం. 

Latest News
 
'ఓకే ఒక జీవితం' డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:11 PM
'కార్తికేయ 2' 41 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:04 PM
క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యబోతున్న బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ Fri, Sep 30, 2022, 02:49 PM
కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్ Fri, Sep 30, 2022, 02:19 PM
సమంత బాలీవుడ్ మూవీపై లేటెస్ట్ అప్డేట్ Fri, Sep 30, 2022, 02:15 PM