మెగా 153 : మెగా మాస్ కు తోడవుతున్న మరో ఇద్దరు స్టార్ హీరోలు..?

by సూర్య | Fri, Sep 23, 2022, 04:30 PM

బాబీ డైరెక్షన్లో త్వరలోనే మెగా మాస్ తుఫాన్ థియేటర్లను తాకనుంది. అదేనండి... మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ "మెగా 153" త్వరలోనే విడుదల కాబోతుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ లో మరో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది. వారెవరంటే, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. ఈ మధ్యనే నాగార్జున "బ్రహ్మాస్త్ర" లో నంది అస్త్రగా కీరోల్ లో నటించారు. వెంకటేష్ గారు త్వరలోనే విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" సినిమాలో లవ్ జడ్జి గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మెగాస్టార్ సినిమాలో కీరోల్ పోషించబోతున్నారనడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఐతే, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఓటిటిలోకి సైలెంట్ ఎంట్రీ ఇచ్చిన "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" Tue, Oct 04, 2022, 06:42 PM
విజయ్ దేవరకొండ - సమంతల "ఖుషి" మూవీ అప్డేట్ Tue, Oct 04, 2022, 06:31 PM
RAPO 20: ఎనర్జిటిక్ రామ్ సరసన 'పెళ్లిసందD' బ్యూటీ..?? Tue, Oct 04, 2022, 06:24 PM
క్రిస్మస్ కు రాబోతున్న సంతోష్ శోభన్ "అన్ని మంచి శకునములే" Tue, Oct 04, 2022, 06:10 PM
సికింద్రాబాద్ వినాయకుడి గుడిలో "ఘోస్ట్" చిత్రబృందం Tue, Oct 04, 2022, 06:03 PM