దుల్కర్ సల్మాన్ "చుప్" డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 03:03 PM

సీతారామం సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, లేటెస్ట్ గా 'చుప్' అనే యూనివర్సల్ కాన్సెప్ట్ తో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 
ప్యాడ్ మ్యాన్ తదుపరి ఆర్. బాల్కి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. తక్కువ రేటింగ్, నెగిటివ్ రివ్యూలిచ్చే ఫిలిం క్రిటిక్స్ పై సీరియల్ కిల్లర్ గా మారిన ఒక ఆర్టిస్ట్ ఎలా పగ తీర్చుకున్నాడు అనే విభిన్నమైన, సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. రీసెంట్గా రిలీజైన ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
లేటెస్ట్ గా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ప్రముఖ జీ 5 సంస్థ చుప్ మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిందని వినికిడి. పోతే, ఈ సినిమాలో శ్రేయా ధన్వంతరి హీరోయిన్ గా నటిస్తుండగా, సన్నీ డియోల్, పూజా భట్ కీలకపాత్రల్లో నటించారు.

Latest News
 
'కార్తికేయ 2' 40 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Sep 29, 2022, 05:26 PM
'రంగ రంగ వైభవంగా' డే వైస్ కలెక్షన్స్ Thu, Sep 29, 2022, 05:22 PM
ప్రభాస్ వల్ల ...వాయిదా పడిన "హనుమాన్" టీజర్ - డైరెక్టర్ వైరల్ ట్వీట్ Thu, Sep 29, 2022, 05:17 PM
'బ్రాహ్మాస్త్ర' 17 రోజుల కలెక్షన్స్ Thu, Sep 29, 2022, 05:14 PM
మరికాసేపట్లో రాబోతున్న... కార్తీ "సర్దార్" తెలుగు టీజర్ Thu, Sep 29, 2022, 04:48 PM