by సూర్య | Fri, Sep 23, 2022, 11:20 AM
రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఆకాశం". ఇందులో అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్నారు. కార్తీక్ ఈ సినిమాకు దర్శకుడు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ మనసుకు హత్తుకునేలా, ఆహ్లాదకరంగా ఉంది. వయోకాం 18 స్టూడియోస్ తో కలిసి శ్రీనిధి సాగర్ ఈ సినిమాను నిర్మించారు.
గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా నవంబర్ లో థియేటర్లలో విడుదల కానుంది.