లూసిఫర్ 2 స్క్రిప్ట్ లాక్డ్ ... పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ..!

by సూర్య | Wed, Aug 17, 2022, 06:34 PM

2019లో విడుదలైన మలయాళ చిత్రం "లూసిఫర్" ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్టోరియల్ డెబ్యూగా రూపొందిన ఈ చిత్రంలో మోహన్ లాల్ లీడ్ రోల్ పోషించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక విలన్ పాత్రలో నటించారు.
లేటెస్ట్ ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ ను లాక్ చేశామని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్తామని అభిమానులకు తెలుపుతూ, మేకర్స్ స్పెషల్ వీడియోను విడుదల చేసారు.
 L 2 ఎంపురాన్ పేరుతో రూపొందబోతున్న ఈ సీక్వెల్ చిత్రానికి మురళి గోపి రచయితగా పని చేసారు. లూసిఫర్ ఫస్ట్ పార్ట్ ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" గా రీమేక్ చేస్తున్నారు.

Latest News
 
'యశోద' 23 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:51 PM
'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:46 PM
'మసూద' 17 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:32 PM
'గాలోడు' 17 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:18 PM
'లవ్ టుడే' 11 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:02 PM