ఆస్కార్ బరిలో నాని "శ్యామ్ సింగరాయ్"...!!

by సూర్య | Wed, Aug 17, 2022, 06:01 PM

నాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి ముఖ్యపాత్రలు పోషించిన పిరియాడికల్ డ్రామా "శ్యామ్ సింగరాయ్". గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీలో ఒక క్లాసిక్ లా నిలిచిపోయింది.
నాని కెరీర్ లో అత్యధిక బడ్జెట్టుతో నిర్మింపబడిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు క్యాటగిరీల్లో శ్యామ్ సింగరాయ్ నామినేషన్స్ పొందిందని ప్రచారం జరుగుతుంది.
బెస్ట్ క్లాసికల్ డాన్స్ కొరియోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ట్రెడిషనల్ క్లాసికల్ ఫిలిమ్స్ ...క్యాటగిరీల్లో ప్రభుత్వం తరపున శ్యామ్ సింగరాయ్ మూవీ ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్లిందట.
రాహుల్ సంక్రుత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1970ల కాలంనాటి కోల్కతా నేపథ్యంలో జరుగుతుంది. 

Latest News
 
ఈరోజు సాయంత్రమే వీరయ్య విజయ విహారం వేడుకలు..!! Sat, Jan 28, 2023, 11:58 AM
సస్పెన్స్ డిటెక్టివ్ థ్రిల్లర్ గా "భూతద్దం భాస్కర్ నారాయణ" టీజర్ Sat, Jan 28, 2023, 11:49 AM
'బుట్టబొమ్మ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల ..!! Sat, Jan 28, 2023, 11:22 AM
RRR హిస్టారికల్ రికార్డుపై రాజమౌళి హార్ట్ ఫెల్ట్ నోట్ ..!! Sat, Jan 28, 2023, 11:07 AM
ఆల్ టైం రికార్డు : జపాన్లో RRR శతదినోత్సవం ...!! Sat, Jan 28, 2023, 10:56 AM