కొమురం భీముడో సాంగ్ పై రాజమౌళి ఇంటరెస్టింగ్ కామెంట్స్

by సూర్య | Wed, Aug 17, 2022, 05:44 PM

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన "RRR" లో సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ఎం ఎం కీరవాణి స్వరపరిచిన ఈ మూవీ పాటలు మనసుకు హత్తుకునే మ్యూజిక్ తో, అద్భుతమైన లిరిక్స్ తో ప్రేక్షకుల ఫేవరెట్ ఆల్బంగా నిలిచాయి.
ఈ సినిమాలోని కొమురం భీముడో సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటలో తారక్ తన నటవిశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి.
ఇటీవల రాజమౌళి ఒక పాడ్ క్యాస్ట్ లో పాల్గొని ఈ పాట వెనుక ఉన్న ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ మెల్ గిబ్సన్ "బ్రేవ్ హార్ట్" క్లైమాక్స్ నుండి ఇన్స్పిరేషన్ పొంది RRR సెకండ్ హాఫ్ లోని కొమురం భీముడో సాంగ్ ను పిక్చరైజ్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాజమౌళి తనను తాను ఏకలవ్యుడిగా, గిబ్సన్ ను ద్రోణాచార్యుడిగా పోల్చడం విశేషం.

Latest News
 
'కాంతారా' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:24 PM
'యశోద' 21 రోజుల డే వైస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:18 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ముఖచిత్రం' Tue, Dec 06, 2022, 04:03 PM
'ఊర్వశివో రాక్షశివో' AP/TS కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:59 PM
'మసూద' 15 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 03:52 PM