బాలయ్య "NBK 108" పై లేటెస్ట్ మేజర్ అప్డేట్

by సూర్య | Thu, Aug 11, 2022, 10:26 AM

పటాస్, సుప్రీం, ఎఫ్ 2, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్ 3 ...ఇలా చేసే ప్రతి సినిమాతో సూపర్ డూపర్ హిట్లు కొడుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తో నటసింహం బాలకృష్ణ ఒక సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో NBK 107(వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఆ సినిమా అయిపోయిన వెంటనే, అనిల్ రావిపూడి సినిమాను స్టార్ట్ చేస్తారు.
ఇందులో బాలయ్య నడివయసు తండ్రి పాత్రను పోషిస్తున్నాడని, ఆయనకు కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తుందని, బిగ్ బాస్ ఓటిటి విన్నర్ బిందు మాధవి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని అనిల్ ఇదివరకే తెలిపారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రోజు సాయంత్రం 04:28 నిమిషాలకు ఈ మూవీ నుండి ఒక సూపర్ అప్డేట్ రాబోతుందంట. ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఇదే ఫస్ట్ అప్డేట్ కావడంతో నందమూరి ఫ్యాన్స్ అందరూ ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. 

Latest News
 
సూట్​లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ! Sun, Mar 23, 2025, 02:53 PM
నెగిటివ్ రోల్‌లో అల్లు అర్జున్ Sun, Mar 23, 2025, 02:33 PM
‘జాట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Mar 23, 2025, 02:27 PM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బాలకృష్ణ, ప్రభాస్‌, గోపిచంద్‌పై ఫిర్యాదు Sun, Mar 23, 2025, 12:32 PM
నా జర్నీలో వారంతా నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు Sun, Mar 23, 2025, 11:54 AM