![]() |
![]() |
by సూర్య | Thu, Aug 11, 2022, 10:20 AM
మెగాస్టార్ చిరంజీవి , మెహర్ రమేష్ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం "భోళా శంకర్". ఈ చిత్రం 2015లో రిలీజ్ అయిన "వేదాళమ్" అనే తమిళ సినిమాకి రీమేక్. అజిత్ నటించిన ఈ చిత్రం తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో, కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు. సాగర్ మహతి స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈరోజు రాఖీ పూర్ణిమ కావడంతో, భోళా శంకర్ మేకర్స్ ఈ మూవీ నుండి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. "అక్కా, చెల్లెళ్ళందరికి రక్షాబంధన శుభాకాంక్షలు - ప్రేమతో మీ సోదరుడు చిరంజీవి" అని మెగాస్టార్ మాట్లాడే చిన్న వీడియో క్లిప్ ను రిలీజ్ చేసారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.