![]() |
![]() |
by సూర్య | Wed, Aug 10, 2022, 07:00 PM
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, యంగ్ హీరో విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న తొలి చిత్రం "లైగర్". ఈ సినిమాతోనే ఇద్దరూ పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో, పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యడం విశేషం. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా, పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 25న విడుదల కాబోతున్న లైగర్ ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లైగర్ "ఫ్యాన్ డం టూర్" లో భాగంగా వరంగల్ లో ఆగస్టు 14న సాయంత్రం ఐదింటి నుండి ఆర్ట్స్ కాలేజీ లో మాస్ ప్రమోషన్స్ జరగనున్నాయి. ఈ మేరకు కొంచెంసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు.