పెళ్లి క్యాన్సిలయ్యిందా? .. ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చిన పూర్ణ

by సూర్య | Wed, Aug 10, 2022, 06:53 PM

'అవును' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ బ్యూటీ పూర్ణ. ఆపై సీమటపాకాయ్, అవును 2 మూవీస్ లో హీరోయిన్ గా నటించి, ఈ మధ్యన క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవలే ప్రముఖ బిజినెస్ మాన్ షానిద్ అసిఫ్ అలీ తో పూర్ణ ఎంగేజ్మెంట్ చేసుకుంది.
ఐతే, ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయం పూర్ణ వరకు వెళ్లడంతో, డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా స్పందించింది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తను పెళ్లి చేసుకోబోయే అతనితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసి 'ఎప్పటికీ నా సొంతం' అంటూ కామెంట్ చేసింది. దీంతో పూర్ణ పెళ్లిపై ఇప్పటివరకు వచ్చిన వార్తలు కేవలం పుకార్లే అని తేలింది.

Latest News
 
'కాంతార' 47 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:55 AM
'ఊర్వశివో రాక్షశివో' AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:46 AM
'యశోద' 23 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:32 AM
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 11 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:23 AM
గూగుల్ సెర్చ్ లో టాప్-10 సినిమాలివే! Thu, Dec 08, 2022, 11:17 AM