సౌత్ కోసం నార్త్ సినిమాలను రిజెక్ట్ చేసిన "బేబమ్మ"

by సూర్య | Mon, Aug 08, 2022, 05:33 PM

అప్పట్లో.. ఇప్పట్లో... ఏ కాలంలోనైనా టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ లో పాగా వేసేందుకు, అక్కడ టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, కన్నడ బ్యూటీ, ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి ఉవ్వెత్తున ఎగిసిపడిన అందమైన యువకెరటం కృతిశెట్టి మాత్రం  సౌత్ సినిమాల కోసం బాలీవుడ్ అవకాశాలను తృణప్రాయంగా వదులుకుందట. ఈ విషయాన్ని స్వయంగా కృతినే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
హృతిక్ రోషన్ "సూపర్ 30" లో చిన్న రోల్ లో కనిపించిన కృతి ఆపై 2021లో మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ డిబట్ మూవీ "ఉప్పెన" తో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. ఆ తరవాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు చిత్రాలలో నటించి గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం కృతి నితిన్ "మాచర్ల నియోజవర్గం" లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన విడుదల కాబోతుంది.  

Latest News
 
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM
అన్స్టాపబుల్ : వాడీవేడిగా పవర్ స్టార్మ్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో Sun, Feb 05, 2023, 06:54 PM
రైటర్ పద్మభూషణ్ రెండ్రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..!! Sun, Feb 05, 2023, 06:34 PM
NTR 32 పై సెన్సేషనల్ బజ్..!! Sun, Feb 05, 2023, 06:29 PM
మేనల్లుడి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సూపర్ స్టార్..!! Sun, Feb 05, 2023, 06:10 PM