'లైగర్' ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్న సరిగమ సినిమాస్

by సూర్య | Sat, Aug 06, 2022, 02:10 PM

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే "లైగర్" సినిమాలో నటిస్తున విషయం అందరికి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఓవర్సీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లో అగ్రగామిగా ఉన్న సరిగమ సినిమాస్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లైగర్' రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని  ప్రొడక్షన్ హౌస్ పూరి కనెక్ట్స్ ట్విట్టర్‌లో అధికారకంగా ప్రకటించింది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.

Latest News
 
ఆసుపత్రిలో ఉన్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి Mon, Aug 15, 2022, 11:11 PM
రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ' మూవీ అప్డేట్ Mon, Aug 15, 2022, 10:13 PM
మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!! Mon, Aug 15, 2022, 06:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్ Mon, Aug 15, 2022, 06:26 PM
వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు "ఘోస్ట్" బెడద ...? Mon, Aug 15, 2022, 06:15 PM