వివాదాస్పద సహాయనటి మరోసారి వార్తల్లోకి?

by సూర్య | Sat, Aug 06, 2022, 12:15 PM

సీనియర్ హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ ల సీక్రెట్ ఫ్రెండ్షిప్ పై గత కొన్నిరోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు ఎంత హాట్ టాపిక్ గా నిలిచాయో అందరికి తెలిసిన విషయమే. నరేష్, పవిత్ర ఒక హోటల్ రూమ్ లో ఉండగా, నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, వారిపై చెప్పులతో దాడికి దిగడం మరింత హాట్ టాపిక్ గా నిలిచింది.
ఇటీవల విడుదలైన రవితేజ "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలో ఒక సీన్లో పవిత్ర, నరేష్ కలిసి కనిపిస్తారు. ఆ సీన్ తెరపై వచ్చినప్పుడు ప్రేక్షకుల అరుపులు, ఈలలు మాములుగా లేవు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. దీంతో ప్రేక్షకుల్లో తన క్రేజ్ ఉందని తెలుసుకుని ఇకపై నటించబోయే సినిమాలకు రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసిందంట. రోజుకు 60-70 వేలు తీసుకునే పవిత్ర అందుకు రెట్టింపు డిమాండ్ చెయ్యాలని డిసైడ్ అయ్యిందని టాక్. కాంట్రవర్సీల్లో నిలిచే వ్యక్తులను తమ సినిమాల్లో నటింపజేసేందుకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు అంతగా ఆసక్తి చూపించరు. అదీగాక పవిత్ర పారితోషికాన్ని కూడా పెంచడంతో ఇకపై ఆమెకు సినిమా అవకాశాలు రావడం కష్టమే అని కొంతమంది అంటున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM