చిరంజీవి - వెంకీ కుడుముల మూవీపై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Fri, Aug 05, 2022, 06:50 PM

2018లో యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన ఛలో చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమయ్యాడు వెంకీ కుడుముల. ఆ తర్వాత మరో యంగ్ హీరో నితిన్ తో 2010లో భీష్మ సినిమాని తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలనందుకున్నాయి. దీంతో వెంకీ కుడుముల పేరు ఇండస్ట్రీ మొత్తం మారు మోగిపోయింది. ఈ క్రేజ్ తో మెగాస్టార్ చిరంజీవి గారికే ఒక స్టోరీ ని చెప్పి ఆయనతో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా DVV దానయ్య వ్యవహరిస్తారని కూడా టాక్ ఉంది. ఈ మూవీ ఆగిపోయిందని కూడా గతంలో ప్రచారం జరిగింది. ఆ తరవాత వెంకీ చిరుతో సినిమా ఉంటుందని చెప్పి అందరికి క్లారిటీ ఇచ్చారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, చాలా డిస్కషన్స్, సజెషన్స్ తరవాత ఇటీవలే వెంకీ ఫైనల్ స్క్రిప్ట్ ను చిరుకు నెరేట్ చేసాడంట. ఇక, చిరు నుండి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయట. ఈ సినిమా సోషల్ డ్రామాగా ఉండబోతుందంట. చిరు మూవీ కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ కంపల్సరీ అనుకోండి.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM