బాలీవుడ్ బాయ్ కాట్ ట్రెండ్ కార్తికేయ2కు కలిసొస్తుందా?

by సూర్య | Fri, Aug 05, 2022, 06:39 PM

ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుంది. బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా, బాయ్ కాట్ ఆలియాభట్, బాయ్ కాట్ రక్షాబంధన్ అంటూ... సోషల్ మీడియాలో పెద్దఎత్తున హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగిస్తూ, ఆ సినిమాలను చూడొద్దంటూ ప్రచారం జరుగుతుంది.
గతంలో ఆమీర్ చేసిన దేశవ్యతిరేక వ్యాఖ్యల ప్రభావం ఇప్పడు లాల్ సింగ్ చద్దా సినిమాపై పడుతుంది. ఆలియాభట్ నటించి నిర్మించిన డార్లింగ్స్ లో మగవారిపై గృహహింస, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ పాకిస్థానీ మూవీకి కాపీ కావడంతో, బాలీవుడ్ ప్రేక్షకులు ఆ సినిమాలను చూడడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. కొంతమంది నెటిజన్లయితే, ఈ సినిమాలకు బదులుగా సౌత్ సినిమా "కార్తికేయ 2" ను చూస్తామని, భారతీయ విలువలు, సంప్రదాయాలను చాటిచెప్పే కార్తికేయనే చూడమని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలా చూసుకుంటే, కార్తికేయ 2 కు బాలీవుడ్లో ఫ్రీ పబ్లిసిటీ, మంచి బజ్ క్రియేట్ అవుతుంది. సో, ఆగస్టు 13న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోయే ఈ మూవీకి ఉత్తరాదిన మంచి ఓపెనింగ్స్ వచ్చేటట్టు కనిపిస్తుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM