"కృష్ణగాడి వీరప్రేమగాథ" కాంబో రిపీట్ కాబోతుందా?

by సూర్య | Fri, Aug 05, 2022, 06:30 PM

నాచురల్ స్టార్ నాని హిట్ సినిమాలలో "కృష్ణగాడి వీరప్రేమగాథ" ఒకటి. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన రెండవ సినిమా ఇది. 2016లో విడుదలైన ఈ చిత్రం సాలిడ్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో హను బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లను అందుకుని ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచాడు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, 'సీతారామం' తదుపరి హను రాఘవపూడి నానితో ఒక సినిమా చెయ్యబోతున్నారని టాక్. ప్రస్తుతం అందుకు సంబంధించి, నానితో కథా చర్చలు జరుగుతున్నాయట. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందట. హను ఫస్ట్ సినిమా "అందాల రాక్షసి" స్టోరీని ముందుగా నానికే వినిపించగా, ఆ సమయంలో నాని ఈగ సినిమాతో బిజీగా ఉండడంవల్ల చెయ్యలేకపోయాడట.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM