వామ్మో.. ఒక్కో సినిమాకు రష్మిక ఇంత తీసుకుంటుందా?

by సూర్య | Fri, Aug 05, 2022, 04:05 PM

రష్మిక మండన్నా .... 2016 లో విడుదలైన కన్నడ సినిమా 'కిరాక్ పార్టీ'తో సినీ రంగ ప్రవేశం చేసింది. రెండేళ్ల తరవాత నాగసౌర్య నటించిన 'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన 'గీత గోవిందం' తో ఇటు ఫ్యామిలీ ఆడియన్సులో,అటు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
టాలీవుడ్లో వరస సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలతో దూసుకుపోతున్న రష్మిక, 'పుష్ప'లో శ్రీవల్లిగా నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సినిమా బాలీవుడ్లో ఘన విజయం సాధించటంతో వరసపెట్టి హిందీ ఆఫర్లను చేజిక్కించుకుంటుంది ఈ బ్యూటి. ఇప్పటికే బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో చేసిన  మిషన్ మజ్ను, బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో చేసిన గుడ్ బై సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో రష్మిక క్రేజ్ బాలీవుడ్లో మరింత పెరగనుంది.
రష్మిక క్రేజ్ ఎంతలా ఉందంటే, పుష్ప సినిమా ముందువరకు ఒక్కో సినిమాకు 1-2 కోట్లు తీసుకునే ఈ కన్నడ బ్యూటీ ఆఫ్టర్ పుష్ప నిర్మాతలను నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుందట. తెలుగులో ఐతే రష్మిక హీరోయిన్ గా కావాలి అనుకుంటే 3 కోట్లు పక్కన పెట్టాల్సిందే. నిర్మాతలు కూడా ఆమెకున్న క్రేజ్ కారణంగా ఇంతటి భారీ మొత్తాన్ని ఇవ్వడానికి వెనుకాడట్లేదట.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM