![]() |
![]() |
by సూర్య | Fri, Aug 05, 2022, 03:52 PM
హన్సిక.. ఈమె అందానికి ముగ్ధులవని వారుండరు. అంతటి అందానికి కోలీవుడ్లో విగ్రహం పెట్టి గుడి కూడా కట్టేసారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించడమే కాక కళావతి, చంద్రకళ వంటి హారర్ సినిమాలతో భయపెట్టింది కుడా.
అల్లు అర్జున్ నటించిన "దేశముదురు" తో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ, తదుపరి కంత్రి, మస్కా, బిల్లా, కందిరీగ, ఓహ్ మై ఫ్రెండ్ వంటి తెలుగు సినిమాలలో నటించి, ఆపై కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వుమెన్ సెంట్రిక్ సినిమాలకు ప్రస్తుతం కేరాఫ్ అడ్రెస్ గా ఉంది హన్సిక.
లేటెస్ట్ బజ్ ప్రకారం, హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. ప్రముఖ సౌత్ పొలిటీషియన్ కుమారుడు, వ్యాపారవేత్తతో హన్సిక ఏడడుగులు నడవబోతుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని, ఇరు కుటుంబ సభ్యులు అందుకు సంబంధించిన పనులను సైలెంట్ గా కానిచ్చేస్తున్నారట. ఐతే, ఈ విషయంపై క్లారిటీ రావలసి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఉత్తరాది ఆడపడుచు దక్షిణాది కోడలు పిల్ల కాబోతుందన్న మాట.