బిగ్ బ్యాంగ్ తో రీఎంట్రీ ఇవ్వబోతున్న 'చందమామ'

by సూర్య | Fri, Aug 05, 2022, 02:51 PM

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవల కాజల్ నిర్వహించిన ఇన్స్టా లైవ్ లో సెప్టెంబర్ 13 నుండి జరగబోయే "ఇండియన్ 2" షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలిపి అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది.
కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ , స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గతంలోనే ప్రారంభమై, కొంతమేర షూటింగును కూడా జరుపుకుంది. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా చాలా లాంగ్ బ్రేక్ తీసుకుని ఈ మధ్యనే మళ్ళీ వార్తలకెక్కింది.
కొరటాల - మెగాస్టార్ కాంబోలో వచ్చిన "ఆచార్య" నిజానికి, కాజల్ కి చివరి సినిమా కావలసి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల కాజల్ ను ఆ సినిమా నుండి తప్పించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా కాజల్ ఇండియన్ 2 వంటి పాన్ ఇండియా రేంజ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం ఆమె అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM