వైజాగ్‌లో రొమాన్స్ చేయనున్న విజయ్ దేవరకొండ - సమంత

by సూర్య | Thu, Jul 07, 2022, 02:24 PM

టాలీవుడ్ యంగ్ అండ్ సేనాషనల్ హీరో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన గ్లామర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు జంటగా కనిపించనుంది. మూవీ మేకర్స్ ఈ సినిమాకి 'ఖుషి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ లో లీడ్ పెయిర్ మధ్య కొన్ని క్యూట్ రొమాంటిక్ స్కీన్స్ ఉంటాయి అని లేటెస్ట్ టాక్. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు త్వరలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్ లో జరుగనుంది అని సమాచారం. అందమైన బీచ్ లొకేల్స్‌లో రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 23, 2022న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM